చెరువులకు మరమ్మతు చేయాలని వినతి

నవతెలంగాణ-తుర్కయంజాల్‌
తుర్కయంజాల్‌ మున్సిపాలిటీ పరిధిలోని ఉమారఖాన్‌గూడ చెరువు కట్టకు మరమ్మతులు చేయాలని కోరుతూ కౌన్సిలర్‌ కరాడి శ్రీలత అనిల్‌ కుమార్‌ ఆధ్వర్యంలో సాగునీటి పారుదల మరియు ఆయకట్టు అభివద్ధి శాఖ ఉప కార్య నిర్వహణ ఇంజనీర్‌ ఇబ్రహీంపట్నం గుండెమోని ఉషారాణికి సోమవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కరాడి శ్రీలత అనిల్‌కుమార్‌ మాట్లాడుతూ గత 2020లో అకాల వర్షాలకు ఉమార్‌ఖాన్‌గూడ చెరువు తెగిపోయి చెరువు కింద భాగంలో ఉన్న మిగతా ఐదు గ్రామాల చెరువులు కూడా తెగిపోవడం జరిగిందని నేటి వరకు ఎలాంటి మరమ్మత్తులు చేపట్టలేదని తెలిపారు. రానున్న వర్షాకాలం లోపు చెరువు కట్టలను నిర్మాణం చేయాలని భవిష్యత్తులో తెగిపోకుండా భారీ వర్షాలను తట్టుకునే విధంగా పున:నిర్మాణం చేయాలని కోరారు. భవిష్యత్‌ తరాలు బాగుండాలంటే జల సంరక్షణ ఎంతో అవసరమని జల సంరక్షణ తోటే మానవ ప్రకతి జీవధారమైన ప్రాణం ఉన్న ప్రతి జీవి కాపాడబడుతుందని పేర్కొన్నారు. సాధ్యమైనంత త్వరగా తెగిపోయిన చెరువులను కట్టడాల ద్వారా పునఃనిర్మించాలని కోరారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని అని తెలిపారు. డీఈ సాధ్యమైనంత త్వరగా సమస్యను పరిష్కరిస్తామని తెలిపారన్నారు. కార్యక్రమంలో ఆదిభట్ల మున్సిపల్‌ కౌన్సిలర్‌ ఫ్లోర్‌ లీడర్‌ పొట్టి రాములు, కోహెడ మాజీ సర్పంచ్‌ సానెం అర్జున్‌ గౌడ్‌, ఓబీసీ మోర్చా మున్సిపల్‌ ప్రధాన కార్యదర్శి అజరు గౌడ్‌, వేణు రెడ్డి, శివకుమార్‌, దార వెంకటేష్‌, పండుగల రాము, వైభవ్‌ తదితరులు పాల్గొన్నారు.