నిరుపేదలకు అండగా ఉప్పల ఫౌండేషన్‌

నవతెలంగాణ-తాండూరు
తాండూరు పట్టణ కేంద్రంలో ఆదివారం రాత్రి ఇంటర్నేషనల్‌ వైశ్య ఫెడరేషన్‌ తాండూర్‌ పట్టణం, వికారాబాద్‌ జిల్లా కమిటీల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆర్యవైశ్య కల్యాణ మండపంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్‌ గుప్తా విచ్చేసి కార్యవర్గాన్ని కమిటీలను ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఉప్పల ఫౌండేషన్‌ చైర్మన్‌ ఉప్పల శ్రీనివాస్‌గుప్త తాండూర్‌ పట్టణంలో ఉన్న నిరుపేదలకు రెండు కుటుంబలకు పుస్తె మెట్టలు, బట్టలు అందజేశారు. బాసుపల్లి గ్రామస్తులైన నిరుపేద మహిళలకు వేముల సురేందర్‌ గారి సహకారంతో రెండు కుట్టు మిషిన్స్‌ ఇవ్వడం జరిగింది, గాజీపూర్‌ గ్రామంలో హై స్కూల్‌కు సంతోష్‌ కుమార్‌ సహకారంతో సిలింగ్‌ ఫాన్స్‌ అందజేశారు. ఉప్పల శ్రీనివాస్‌ గుప్తా మాట్లాడుతూ వైశ్యులకు ఏ విధంగా అయినా సాయం కోరిన చేయడానికి ఎల్లవేళల ముందు ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమానికి తాండూరు మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ స్వప్న పరిమల్‌, ఐవిఎఫ్‌ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పబ్బ చంద్రశేఖర్‌, అడ్వైజర్‌ కటకం శీను , యూత్‌ అధ్యక్షులు కట్ట రవి , యూత్‌ కోశాధికారి కొల్పూరి నరేష్‌, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు రజనీకాంత్‌, జనగామ అధ్యక్షులు బీజ్జలా నవీన్‌ ఐవిఎఫ్‌ ప్రధమ మహిళా ఉప్పల స్వప్న, మహిళ విభాగ్‌ కార్యదర్శి లెంకెలపల్లి మంజుల రాష్ట్ర నాయకులు నాయకురాలు, యాలాల ఎంపీటీసీ దేవాగారి రాములు, కౌన్సిలర్‌ సాహూ శ్రీలత ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కటకం వీరేందర్‌ , కార్యదర్శి కోట మురళి , పొట్లి మహారాజ్‌ దేవస్థానం చైర్మన్‌ భాను , మహిళా సంగం అధ్యక్షురాలు కల్వ సరిత, ఐవిఎఫ్‌ అధ్యక్షులు ప్రవీణ్‌ , వాసవి క్లబ్‌ అధ్యక్షులు సతీష్‌ పాల్గొన్నారు.