రైల్వే ప్రయాణికులకు ఎస్సై పలు సూచనలు

– వేసవికాలం ప్రారంభం అవుతున్న నేపథ్యంలో చోరీలు ఎక్కువగా జరగకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి
నవతెలంగాణ – కంటేశ్వర్
వేసవి కాలం స్టార్ట్ అయింది కాబట్టి చోరీలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి రైల్లో ప్రయాణించే ప్రయాణికులు, వారితో వచ్చే వారు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని నిజామాబాద్ రైల్వే ఎస్సై సాయి రెడ్డి మంగళవారం ప్రకటనలో తెలియజేశారు. భోగిలో కిటికీల వద్ద కూర్చున్నపుడు మీ మెడలోని బంగారు చైన్ లు, ఇతరులకు కనిపించే విధంగా ఉంచరాదని తెలిపారు. మీ యొక్క బ్యాగులో విలువైన బంగారం వస్తువులు, డబ్బులు ఉంచరాదని తెలియజేశారు. మీయొక్క ఫోన్ లు ఛార్జింగ్ పెట్టి పడుకొరాదు. ట్రైన్ ఆగి మరల కదులు తున్నప్పుడు మీరు వాష్ రూమ్ ల వద్ద ఉండరాదు.అడ వారిని ఎవరైనా ఇబ్బంది పెట్టినా మి యొక్క వస్తువులు పోయినా వెంటనే 139 కు చేయాలన్నారు లేదంటే సంబంధిత రైల్వే ఎస్సై నిజామాబాద్ 87126-58591 నంబర్ కు ఫోన్ చేసి సమాచారం అందించాలని కోరారు.