మానవ సేవే..మాధవ సేవ: బుసిరెడ్డి ఫౌండేషన్                

నవతెలంగాణ – పెద్దవూర                            
నల్గొండ జిల్లా,నాగార్జునసాగర్ నియోజకవర్గం, నిడమనూరు మండలం, తుమ్మడం గ్రామంలోని హరిజన కులస్తులు అయినటువంటి ముండ్ల రాములమ్మ, (83)మంగళవారం మృతి చెందారు. ఈ విషయం తెలియజేయగానే ఆ కుటుంబానికి అండగా బుసిరెడ్డి ఫౌండేషన్ వారు అంత్యక్రియలు అనంతరం భోజనాలు పంపించారు. ఆర్ధికంగా ఇబ్బందివున్న నిరుపేద కుటుంబాలకి మన బుసిరెడ్డి ఫౌండేషన్ ఎల్లపుడు అన్నదానం చేయడానికి సిద్ధంగా ఉంటుందని బుసిరెడ్డి పాండురంగారెడ్డిపిలుపునిచ్చారు. సహాయం కోసం టోల్ ఫ్రీ నెంబర్ 9581742356 కు సంప్రదించవలసినదిగా కోరారు.ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.