విద్యార్థులకు ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు  

charset=InvalidCharsetId

నవతెలంగాణ – వీర్నపల్లి
విద్యార్థులకు ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ జే రమేష్ హెచ్చరించారు. వీర్నపల్లి మండలం పోలిస్ స్టేషన్ లో ఎస్ ఐ జే రమేష్ విలేకరుల సమావేశంలో త్వరలో జరగనున్న ఇంటర్మీడియట్, టెన్త్, డిగ్రీ వార్షిక పరీక్షలు మొదలవుతున్న నేపద్యంలో, విద్యార్థులకు ఇబ్బంది కల్గించే విధంగా మైక్ లలో శబ్దాలు చేస్తే, డి జే లు పెట్టి శబ్ద కాలుష్యం చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇంటర్మీడియట్ పిబ్రవరి 28 నుంచి పరీక్షలు ప్రారంభం అవుతున్నాయి గనుక విద్యార్థులు రాత్రి, పగలు చదువులో నిమగ్నం అయి ఉంటారు, అన్ని మతాల సంబందించిన ప్రార్థన మందిరాలలో మైక్ లలో శబ్దాలు పెడితే పిల్లల చదువుకు ఆటంకం కలిగే అవకాశం ఉంటుంది. పరీక్షలు ముగిసే వరకు లౌడ్ స్పీకర్లు లో శబ్దాలు చెయ్యకూడదు, ఎవరైనా శబ్దకాలుష్యం చేసి విద్యార్థులకు ఇబ్బంది కలిగే విధంగా ప్రవర్తిస్తే వారి పైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు . అలాగే 144 సెక్షన్ అమలు లో ఉంటుంది , పరీక్ష కేంద్రాల వద్ద 100 మీటర్ల పరిధి లో అనవసరంగా ఎవరు ఉండకూడదు, పరీక్ష సెంటర్ కు దగ్గరలో జిరాక్స్ సెంటర్ లు తెరువరాదు. విద్యార్థులు సకాలంలో పరీక్ష సెంటర్ కు చేరుకోవాలనీ తెలిపారు.