– ఒక్క నిమిషం నిబంధన అమలు..
పరీక్షా సమయం ఉదయం 9 నుండి 12 గంటల వరకు
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఈ ఏడాది ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ఫిబ్రవరి 28 నుండి మార్చి 14 వరకు జరగనున్న నేపధ్యంలో పరీక్షా కేంద్రాల్లో సంబంధిత సిబ్బంది ఏర్పాట్లు పూర్తి చేసారు. నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట లో ఏర్పాటు చేసిన 3 పరీక్షా కేంద్రాల్లో పరీక్షార్ధులు కూర్చునే విధంగా కుర్చీలు,బల్లులు సర్ధుబాటు చేసారు.బల్లలు పై హాల్ టికెట్ నెంబర్ రాయడంతో పాటు పరీక్ష గదిలోనూ బ్లాక్ బోర్డ్ పై హాల్ టికెట్ నెంబర్ల వివరాలు నమోదు చేసారు. మూడు పరీక్షా కేంద్రాలు పరిధిలో నియోజక వర్గంలోని అశ్వారావుపేట,దమ్మపేట మండలాల లోని 7 కళాశాలలకు చెందిన 1771 మంది విద్యార్ధులు పరీక్షలు రాయడానికి సరిపడా 36 గదులు,పరీక్షలు పర్యవేక్షించడానికి 39 మంది ఇన్విజిలేటర్ స్ ను ఇంటర్ విద్యాశాఖ పరీక్షలు నిర్వహణ విభాగం కేటాయించింది. పరీక్షా కేంద్రాలను మంగళవారం సి.ఐ కరుణాకర్,ఎస్.హెచ్.ఒ ఎస్.ఐ శ్రీను లు సందర్శించి పరీక్ష ల ఏర్పాట్లు,బందోబస్తు అంశాలను సంబంధిత సి.ఎస్ లు నరసింహారావు,రామయ్య,యేశోబు లతో చర్చించారు. ఈ పరీక్షలు రాసే సమయం ఉదయం 09 గంటలు నుండి 12 గంటలు వరకు మాత్రమే నని, విద్యార్ధులు హాల్ టికెట్ తో 15 నిమిషాలు ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని,1 నిమిషం నిబంధన మాత్రమే అమలు చేస్తాం అని,అంతకంటే ఎక్కువ సమయం లో హాల్ దగ్గరకు వచ్చినా పరీక్ష రాయడానికి అనుమతి ఇవ్వడం కుదరదు అని,పరీక్ష గదిలో నుండి చివరి క్షణం వరకు బయటకు పంపడం కుదరదు అని డి.ఒ లు అలవాల వెంకటేశ్వర్లు,ఝాన్సీ,ఎల్.శివప్రసాద్ లు తెలిపారు. పరీక్షా కేంద్రాలు : ప్రభుత్వ జూనియర్ కళాశాల. మొత్తం పరీక్షార్ధులు : 771 ప్రధమ సంవత్సరం : 344 ద్వితీయ సంవత్సరం : 396 ప్రైవేట్ : 31 గదులు : 16 పర్యవేక్షకులు :17 సిఎస్ : డి.నరసింహారావు డిఒ : అలవాల వెంకటేశ్వర్లు ముస్లిం మైనార్టీ బాలికల జూనియర్ కళాశాల. మొత్తం పరీక్షార్ధులు : 348 ప్రధమ సంవత్సరం : 145 ద్వితీయ సంవత్సరం : 187 ప్రైవేట్ : 16 గదులు : 06 పర్యవేక్షకులు : 07 సిఎస్ : రామయ్య డిఒ : ఝాన్సీ వికెడివిఎస్ రాజు జూనియర్ కళాశాల. మొత్తం పరీక్షార్ధులు : 652 ప్రధమ సంవత్సరం : 340 ద్వితీయ సంవత్సరం : 249 ప్రైవేట్: 43 ఒకేషనల్: 20 గదులు: 14 పర్యవేక్షకులు : 15 సిఎస్ : యేశోబు డిఒ : ఎల్.శివ ప్రసాద్