లోక్‌ అదాలత్‌నుబ సద్వినియోగం చేసుకోవాలి

– భూపాలపల్లి సిఐ రామ్‌ నరసింహారెడ్డి
నవతెలంగాణ-భూపాలపల్లి
భూపాలపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ప్రజలు లోక్‌ అదాలకు సద్వినియోగం చేసుకోవాలని భూపాలపల్లి సిఐ రామ్‌ నరసింహారెడ్డి సూచించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ. జూన్‌ 10వ న భూపాలపల్లి కోర్టులో ”నేషనల్‌ లోక్‌ అదాలత్‌” నిర్వహించడం జరు గుతుందన్నారు. ఎవరైనా ఏమైనా కేసులు ఉన్నట్లైతే వాటిని రాజి చేసుకునేందుకు జూన్‌ 01 నుండి జూన్‌ 10 వరకు రెండు పార్టీలు కోర్టుకు హాజరైనట్లయితే ఆ కేసును పూర్తిగా కొట్టివేయడం జరుగుతుందన్నారు. వీటిలో ప్రధానంగా యాక్సిడెంట్‌, కొట్టుకున్న, చీటింగ్‌, చిట్‌ ఫండ్‌, భూతగా దాలు, వివాహానికి సంబంధించినది, చిన్న చిన్న దొంగ తనాలు, మొదలైన కేసులు ఈ లోక అదాలత్‌ రాజీ చేసు కునేందుకు అవకాశం ఉందన్నారు. దీనికోసం ఫిర్యాదు దారుడు మరియు నేరస్తుడు ఇద్దరు తమ యొక్క ఆధార్‌ కార్డు తీసుకుని భూపాలపల్లి కోర్టు కు రావాల్సి ఉంటుం దన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చూసుకోవాలని సీఐ సూచించారు.
పూర్తి వివరాలకు..
భూపాలపల్లి పోలీసులు సీఐ.భూపాలపల్లి 8712658110, ఎస్సై రామకష్ణ. 8712658120, ఎస్సై ప్రశాంత్‌ 9398399542, ఎస్సై స్వప్న కుమారి 8096215187, కోర్టు కానిస్టేబుల్‌ సురేష్‌ 8106191 801 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు.