పరీక్షా కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్ అమలు..

– బందోబస్తు పర్యవేక్షణలో పరీక్షా పత్రాల తరలింపు

-ప్రతీ కేంద్రంలో ఇద్దరు సిబ్బంది తో నిఘా: సీ.ఐ కరుణాకర్ 
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు నేపధ్యంలో పరీక్షా కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్ అమలు చేయాలని తహశీల్దార్,మండల మెజిస్ట్రేట్ ఎం.శ్రీనివాస్ ఆదేశాలు జారీ చేసారని,ఆ మేరకు పోలీస్ బందోబస్తు కు ఏర్పాట్లు చేస్తున్నామని సీఐ కరుణాకర్ తెలిపారు. బుదవారం నుండి జరగనున్న పరీక్షల నిర్వహణకు ఏర్పాటు చేసిన కేంద్రాలను మంగళవారం ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన నవతెలంగాణ తో మాట్లాడుతూ ప్రతీ కేంద్రం వద్ద ఇద్దరు కానిస్టేబుల్స్ ను నిఘా కోసం కేటాయిస్తామని ఇందులో ఒకరు మహిళా కానిస్టేబుల్ ఉంటారని తెలిపారు. పరీక్షా పేపర్లు పరీక్ష హాలు కు తీసుకుని రావడానికి,రాసిన తర్వాత పోస్ట్ ఆఫీసుకు తీసుకుని వెళ్ళడానికి ఎస్కార్ట్ ఉంటారని అన్నారు. పరీక్షా కేంద్రాల పరిసరాల్లో పరీక్ష సమయాల్లో జిరాక్స్ సెంటర్స్,స్టేషనరీ షాప్ బంద్ పాటించాలని కోరారు. ఆయన వెంట ఎస్.హెచ్.ఒ శ్రీను,ప్రభుత్వ జూనియర్ కళాశాల,ముస్లిం మైనార్టీ బాలికల,వీకేడీవీఎస్ రాజు జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాల సిఎస్,డిఒలు నరసింహారావు,అలవాలవెంకటేశ్వర్లు,రామయ్య,ఝాన్సీ,యేశోబు,ఎల్.శివప్రసాద్,ప్రిన్సిపాల్ లు టి.సంగీత,వెలుగోటి శేషుబాబు లు ఉన్నారు.