
నేటి నుండి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో విద్యార్థిని విద్యార్థులకు అందుబాటులో బస్సు సౌకర్యాలు ఉండేలా చూడాలని ఎస్ ఎఫ్ ఐ డివిజన్ కార్యదర్శి సిద్దాల నాగరాజు అన్నారు. ఆర్టీసీ డిపో అసిస్టెంట్ మేనేజర్ పృద్వి రాజ్ గౌడ్ కు మంగళవారం వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ… ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు జరుగుతున్నా నేపథ్యంలో ఆర్మూర్లో ఇంటర్ చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు పరీక్ష కేంద్రాల వద్దకు అందుబాటులో ప్రభుత్వ బస్సు సౌకర్యాలు ఉండేలా చూడాలని మరియు పిప్రి ప్రభుత్వ ఇంటర్ కళాశాలలో పరీక్షలు రాస్తున్న విద్యార్థిని విద్యార్థులకు కోసం స్పెషల్ బస్సు వేయించాలని డిపో అసిస్టెంట్ మేనేజర్ కోరినట్టు తెలిపారు. అలాగే పరీక్ష కేంద్రాల్లో సరైన సౌకర్యాలు, మంచినీటి సౌకర్యం, ఫ్యాన్స్ ఏర్పాటు, ప్రతి పరీక్ష సెంటర్లలో మెడికల్ బృందాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వ డాక్టర్లని కోవడం జరిగిందన్నారు పరీక్ష రాస్తున్న విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు .ఈ కార్యక్రమంలో ఆర్మూర్ మండల అధ్యక్షులు జవహర్ సింగ్ పాల్గొన్నారు.