సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం

నవతెలంగాణ – శంకరపట్నం
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలలో 500 కే గ్యాస్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అమలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి మంగళవారం శంకరపట్నం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ,  కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణం ఆరోగ్యశ్రీ 10 లక్షల కు పెంచిన కాంగ్రెస్ ప్రభుత్వం మరో రెండు పథకాలైన 200 యూనిట్ల ఉచిత విద్యుత్ 500 కే గ్యాస్ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిందని మహిళలకు ఇది వరం లాంటిదని కాంగ్రెస్ పార్టీ మహిళా మండల అధ్యక్షురాలు చింతి రెడ్డి పద్మ అన్నారు. మహిళలకు వరం లాంటిదని ఆమె అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి బత్తిని శ్రీనివాస్ గౌడ్,  కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బసవయ్య గౌడ్,కాంగ్రెస్ పార్టీ మహిళా జిల్లా నాయకురాలు కవ్వ పద్మ  మాజీ సర్పంచులు సదానందం, రాజ కొమురయ్య, రాజిరెడ్డి, నాయకురాలు కోమల, సరోజన, రేణుక, వనిత, స్వరూప, కవిత, సునీత,తదితరులు పాల్గొన్నారు.