నవతెలంగాణబ్యూరో – హైదరాబాద్
ఇంటర్ పరీక్షల్లో నిమిషం నిబం ధన తొలగించాలని పీడీఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష,కార్యదర్శులు ఆవుల నాగరాజు, ఏ కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమా ండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థు లకు రవాణా సమస్య తీవ్రంగా ఉంటు ందని మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్, వరంగల్ వంటి పట్టణాల్లో ట్రాఫిక్ సమస్యలుం టాయని పేర్కొన్నారు. విద్యార్థులు చదు వుకున్న కాలేజీలకు, నివాస ప్రాంతా లకు పరీక్షా కేంద్రాలు దూరప్రాంతాల్లో ఉంటాయని తెలిపారు. ఫీజులు చెల్లించలేదనే కారణంతో ప్రయివేటు కాలేజీ యాజమాన్యాలు హాల్‌టికెట్లు ఇవ్వకుండా విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని విమర్శించారు.
వాటిపై కేసులు నమోదు చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.