
67 వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్ 14 క్రికెట్ పోటీలకు నల్లగొండ జిల్లా జట్టు తరుపున ఆకాంక్ష స్కూల్, హాలియా విద్యార్ధి ఆర్. దత్తు (9వ తరగతి) ఎంపికయ్యాడని పాఠశాల కరస్పాండెంట్ మేడిపల్లి మోహన్ రావు గారు తెలిపారు. ఎంపికైన విద్యార్ది ఈ నెల 26,27,28,29 వ తేదీలలో మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల లో జరిగే పోటీలలో పాల్గొంటాడు అని తెలిపారు. ఈ సందర్బంగా వ్యాయామ ఉపాధ్యాయుడు ఆవుల చంద్రశేఖర్ ను మరియు ఎంపికైన విద్యార్ధి దత్తు ను పాఠశాల కరస్పాండెంట్ మేడిపల్లి మోహన్ రావు గారు మరియు ప్రిన్సిపాల్ మోదాల రవీందర్ గారు అభినందించారు. ఈ కార్యక్రమములో పాఠశాల అద్యాపక బృందం, విద్యార్ధులు పాల్గొన్నారు.