నవతెలంగాణ – అశ్వారావుపేట
కీటక నాశిని విషం సేవించి ఓ వివాహిత మంగళవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడిన ఉదంతం చోటు చేసుకుంది. ఇరుగు పొరుగు వారి కథనం ప్రకారం నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట లోని నందమూరి నగర్ కు చెందిన ఆరేపల్లి పద్మ(32) ఇంట్లో ఎవరూ లేని సమయం లో పురుగుల మందు తాగి ఆత్మ హత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన స్థానికులు కుటుంబీకులకు సమాచారం ఇచ్చి స్థానిక సామాజిక కేంద్రానికి తరలించారు.అక్కడి వైద్యులు చికిత్స చేస్తున్న క్రమంలోనే పరిస్థితి విషమించి మృతి చెందింది.మృతురాలికి భర్త,ఐదేళ్ల లోపు చిన్నారి ఉంది. కాగా ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. సమాచారం అందుకున్న ఎస్.ఎచ్.ఒ ఎస్ఐ శ్రీరాముల శ్రీను మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.