
మండలంలోని కొయ్యుర్ రేంజ్ పరిధిలోని మల్లారం బిట్ పరిధిలో అడవి అబాయరణ్యంలో మంగళవారం మధ్యాహ్నం నుంచి కార్చిచ్చు రగులుతోంది.ప్రమాదవశాత్తు మిషన్ భగీరథ ట్యాoక్,గుట్టల ఆవరణలో అగ్ని ప్రమాదం సంభవించడంతో విలువైన అటవీ సంపద అగ్నికి ఆహుతవుతొంది.అడవిలో పక్షిజాతులు,సారిసపాలు,వన్యప్రాణులు భయంతో పరుగులు పెట్టె ప్రమాదం పొంచివుoది.వేసవికి ముందే అడవుల్లో అగ్ని రాజుకోవడంపై అటవీశాఖ అధికారులు అప్రమత్తమై అడవులను కాపాడాలని పలువురు ప్రకృతి ప్రియులు కోరుతున్నారు.
ప్రమాదాలకు అనేక కారణాలు: భూపాలపల్లి జిల్లా పారెస్ట్ డివిజన్ లోని కొయ్యుర్ రేంజ్ పరిధిలో 14వేల 170 హెక్టార్ల, అనగా 35 వేల ఎకరాల అటవీ భూమి ఉంది.అడవులు కాలడానికి ముఖ్య కారణం తునికాకు సేకరణకు ముందు ప్రూనింగ్ కు బదులుగా అడవులను కాలీసుతుంటారనే ఆరోపణలు ఉన్నాయి.అలాగే అడవుల్లో తిరిగే వ్యక్తులు బీడీలు,సిగరెట్ లు తాగి వాటిని ఆర్పేయకుండానే వాటిని పడవేయడంతో రాలిన ఆకులకు అంటుకొని వేప,డేవాదారి, నల్లమద్ది వంటి గట్టి చెట్లకు తాకడంతో మంటలు వచ్చే అవకాశం ఉంది.