శ్రీ వాసవి హైస్కూల్ ఎనివల్ డే ఉత్సవాలు

– ఆకర్షించిన విద్యార్థినిల సాంస్కృతిక కార్యక్రమాలు
– చదువుల పట్ల విద్యార్థినీవిద్యార్థులకు అవగాహన
నవతెలంగాణ – మద్నూర్

మద్నూర్ మండల కేంద్రంలోని మైత్రి ఫంక్షన్ హాల్ లో బుధవారం నాడు శ్రీ వాసవి హై స్కూల్ ఎనీవల్ డే ఉత్సవాలు పాఠశాల కరస్పాండెంట్ ఉమాకాంత్ సార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినిలు నిర్వహించిన ఆటపాట సంస్కృతి కార్యక్రమాలు ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాయి చదువుల పట్ల విద్యార్థిని విద్యార్థులకు మేధావులు అవగాహన కల్పించారు. విద్య పట్ల పట్టుదల ఎలా ఉండాలి ప్రత్యేక శ్రద్ధ ఎలా చూపాలి అనే విషయాలపై మేధావులు పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు చక్కగా అవగాహన కల్పిస్తూ బోధించారు. ఈ పాఠశాలలో 10వ తరగతి వరకు చదువుకునే విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఎనీ వన్ డే కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ప్రతి ఒక్కరికి భోజన సౌకర్యాలు అన్ని రకాల ఏర్పాట్లు రవాణా సౌకర్యాలు పాఠశాల కరస్పాండెంట్ కల్పించారు. శ్రీ వాసవి విద్యా హై స్కూల్ విద్యా బోధన పట్ల తల్లిదండ్రులు ఆకర్షితులయ్యారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు మేధావులు పాల్గొన్నారు.