నవతెలంగాణ – జుక్కల్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్జి , జుక్కల్ ఎమ్మెలే లక్ష్మీకాంతారావ్ చిత్రపటాలకు మండల కాంగ్రేస్ శ్రేణుల ఆధ్వర్యంలో బుదువారం నాడు పాలాభీషేకం చేసారు. ఈ సంధర్భంగా మండల కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద మండల నాయకుడు కాంగ్ర్రేస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ ఎ. వినోద్, రమేష్ దేశాయి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోనియాగాందీ ఇచ్చిన హమీని నిలబెట్టి మహిళలకు ప్రాదాన్యత కల్పించి ఐదువందల గ్యాస్ సిలెండర్, రెండు వందల యూనిట్ ల ఉచిత జీరో కరెంట్ మంగళ వారం ప్రారంబించారని, ఆరు గ్యారంటిలలో భాగంగా ఒక్కోక్కటిగా ఆమలు దిశగా ప్రారంబిస్తున్నామని , వంద రోజులలో మిగతావన్ని వేరవేర్చుతామని కాంగ్రేస్ పార్టీ ముఖ్య ఉద్దేశమని పేర్కోన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ లక్ష్మన్ పటేల్, మాజీ సర్పంచులు లక్షెట్టి సాయులు, గౌళే యాదవ్, వివిధ గ్రామాల నుండి పెద్దఎత్తున వచ్చిన కాంగ్రేస్ నాయకులు, తదితరులు పాల్గోన్నారు.