– భక్తుల పాలిట ఇలవేల్పు సుదర్శన క్షేత్రం
నవతెలంగాణ – భువనగిరి రూరల్
తెలంగాణ రాష్ట్ర రాజధానికి కేవలం 60 కిలోమీటర్ల దూరంలో యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రానికి కేవలం 12 కిలోమీటర్లదూరంలో మహిమాన్విత క్షేత్రం… పూర్ణగిరి క్షేత్రం..స్వయంభు శ్రీ పూర్ణగిరి సుదర్శన లక్ష్మీనరసింహస్వామి చరిత్ర. శంకు చక్ర నామాలతో సర్పాకారములో సిరియాల సింహం వలె స్వయంభుగా ఈ కొండ గుహలో వెలసినాడు ఈ స్వామి వారిని అంబరీష్యుడు అనే మహాముని దేశ సంచారం చేస్తూ ఈ గుహ లో తపస్సు చేసుకొనుటకు అనువుగా ఉందని నచ్చి తపస్సు చేసుకొనుచుండగా రాక్షసులు తన తపస్సును భంగం చేస్తుండగా నరసింహుడి భక్తుడైన అంబరీష్యుడు స్వామి వారిని వేడుకొనగా స్వామి వారు ప్రత్యక్షమై తన సుదర్శన చక్రాన్ని వదిలి రాక్షసులను సంహరించి అంబరీష్యుని రక్షణకై ఇక్కడే నిలిచినాడు అని పూర్వీకులు చెబుతుంటారు. ఈ స్వామివారిని సర్దార్ సర్వాయిపాపన్న గోల్కొండ కోటకు వెళుతున్నప్పుడు దారిలో ఈ స్వామి వారిని దర్శనం చేసుకుని వెళ్లేవాడంట ఇప్పటికీ ఈ గుట్ట పక్కన ఉన్న రమణానంద ఆశ్రమంలో సర్దార్ సర్వాయి పాపన్న తలదాచుకునే ఒక పెద్ద బండరాయి ఉంటుంది దీనిని ఇప్పటికీ ఇక్కడి ప్రజలు సర్వాయి పాపని గుండు అని పిలుస్తుంటారు ఈ స్వామిని 1850 సంవత్సరం లో బత్తిని అర్వపెళ్లి గౌడ్ అనే భక్తుడు అర్వపల్లి లక్ష్మీనరసింహస్వామి వారి వరాన జన్మించినాడు తల్లిదండ్రులను విడిచి వారికి చెప్పకుండా సూర్యాపేట వద్ద ఉన్న అర్వపల్లి దేవాలయంలో ఉంటుండగా భక్తుడైన అర్వపల్లికి 12 వ ఏట స్వప్నంలో స్వామివారు దర్శనమిచ్చి నాయనా నేను మీ నమాత్ పెళ్లి గ్రామానికి తూర్పున ఎన్నో సంవత్సరాలక్రితం వెలిసినానని నీవు వచ్చి దర్షించుకొని నా సేవ చేస్తూ నీ తల్లిదండ్రుల సేవ కూడా చేసుకో అని చెప్పగా వెంటనే అర్వపల్లి నమాత్ పెళ్లి తిరిగి వచ్చి కొండల గుహలో ఉన్న స్వయంభు గా వెలసిన లక్ష్మీనరసింహస్వామి వారి సేవ చేస్తూ ఉండేవారని గ్రామ పూర్వీకులు చెప్తారు.
2016లో పూర్ణగిరి కురుక్షేత్రం: గతంలో అర్వపల్లి పూజా పురస్కారాలు నిర్వహించగా, అనంతరం వారి కుటుంబ సభ్యులు గ్రామస్థులు స్వామి వారి సేవ చేసేవారు, 2016 జనవరి నెలలో వారి కుటుంబ సభ్యుడు అయిన బత్తిని రాములు గౌడ్ కి స్వామివారు కలలో ఎన్నోసార్లు కనిపించి తన దర్శనానికి రావలసందిగా చెప్పగా ఇది కల అని అతను పట్టించుకోలేదు ఒకరోజు తను ఉద్యోగరీత్యా యాదగిరిగుట్టకు వెళుచుండగా మార్గమధ్యలో రాయగిరి వద్ద ఒక రోడ్డు ప్రమాదానికి గురి అయినాడు అట్టి ప్రమాదంలో తన ద్విచక్ర వాహనం లారీ చక్రాల కింద పడి డ్యామేజ్ అయింది కానీ రాములుకి ఎలాంటి గాయాలు కాలేదు ఇంత పెద్ద ప్రమాదంలో బతికి బయటపడిన అతను ఇది కచ్చితంగా లక్ష్మీనరసింహస్వామి దయ వల్లనే ప్రమాదం నుండి బయటపడ్డానని అని వెంటనే అతను ఇంటికి వచ్చి తన చిన్నాన కొడుకు అయిన బత్తిని సుధాకర్ ని వెంట పెట్టుకొని ఇప్పుడు పిలిచే పూర్ణగిరి (బోడగుట్ట) గుడిదగ్గరకు వెళ్ళినాడు గుడిలో పెద్ద పెద్ద చెట్లు తీగలు స్వామి వారి పైన కప్పబడ్డాయి పైకి వెళ్లి చెట్లను మరియు తీగలను తొలగించి వెంట తెచ్చుకున్న నీళ్లను పంచామృతాలను స్వామివారి పైన పోసి అభిషేకించి పూల మాలను పండ్లను పెట్టి క్రిందకు దిగే క్రమంలో స్వామి వారి పైన పెద్ద నాగుపాము కృష్ణ లీలాలు కలిగి బంగారువన్నె తో దర్శనమిచ్చింది ఈ విషయము గ్రామ ప్రజలకు భక్తులకు తెలిసి తండోవతండాలుగా పూర్ణగిరికి వచ్చి స్వామి వారిని దర్శనం చేసుకున్నారు ఇట్టి విషయంలో 2016 సంవత్సరంలో మీడియా సోషల్ మీడియా పత్రికలలో వచ్చింది జరిగిన విషయాన్ని నమాత్ పెళ్లి గ్రామ సర్పంచ్ ఎంపీటీసీ, గ్రామ పెద్దలు ప్రజలకు బత్తిని రాములు గారు తెలియపరిచారు. అప్పటినుంచి ఈ క్షేత్రం దిన దినంగా అభివృద్ధి చెందుతూ అంచలంచెలుగా అభివృద్ధి చెందుతుంది.

సుదర్శన క్షేత్రం విశిష్టత: ఈ సుదర్శన లక్ష్మీనరసింహస్వామి స్వామి వారు మన తెలుగు రెండు రాష్ట్రాల్లో ఎక్కడా లేడు చెన్నైలో మాత్రమే ఉన్నది అని జీయర్లు పండితులు చెబుతున్నారు ఈ కొండ పైన వేలాది వనమూలికలు ఉన్నాయని ఈ కొండ పైన పది నిమిషాలు కూర్చుంటే వనమూలికల గాలి పీల్చిన ఎన్నో దీర్ఘ రోగాలు నయం అవుతాయని చెబుతుంటారు స్వామివారి గుండెల్లో ఉండి వచ్చే నీరు తీర్థంగా సేవించిన ఎన్నో జబ్బులు నయం అవుతాయని అలాగే ఈ స్వామివారిని దర్శించుకుంటే సంతానం ఉద్యోగం రుణ బాధలు తగ్గుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఈ స్వామి వారి కొండ కింద ఉన్న కోనేరులో ఇప్పటికీ స్వామి వారి దివ్య సర్పం ప్రతిస్వాది నక్షత్రానికి కోనేరులోకి వచ్చి దర్శనమిస్తుంది స్వామివారి దేవాలయంలో ఉన్న క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామి వారికి శంకు చక్ర నామాలు కలిగి ఉంటాడు ఈ స్వామివారి దర్శనానికి వస్తుంటారు.
తెలంగాణ రాష్ట్రంలోనే ఏకైక క్షేత్రం పూర్ణగిరి సుదర్శన లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం: నరసింహ ఉపవాసకులు బత్తిని రాములు గౌడ్..దేశంలోనే సుదర్శన క్షేత్రం ఒకటి తమిళనాడు రాష్ట్రంలో ఉండగా, రెండవది తెలంగాణ రాష్ట్రంలో ఉందని, సుదర్శన క్షేత్రాలు ఎక్కడ ఉండవని, స్వామివారి సుదర్శన చక్రానికి ఎంత శక్తి ఉంటుందో ఈ క్షేత్రానికి అంతకు రెట్టింపు అయినా శక్తి ఉంటుందని నరసింహ ఉపవాసకులు బత్తిని రాములు గౌడ్ తెలిపారు. మొదట స్వామి వారు తనకు లక్ష్మీనరసింహస్వామి వారు స్వప్నంలో దర్శనం ఇచ్చినప్పుడు కల అని వదిలివేయగా, స్వామివారి లీలా మహత్యంతో స్వామివారి సేవలోకి వచ్చినట్లు తెలిపారు.
ఆలయంలో మౌలిక వసతులు కల్పిస్తున్నాం: ఆలయ చైర్మన్ అతికం లక్ష్మీనారాయణ గౌడ్.. పూర్ణగిరి దేవాలయంలో మౌలిక వసతులు దాతల సహకారంతో పూర్తి స్థాయిలో కల్పిస్తున్నట్లు ఆలయ చైర్మన్ లక్ష్మీనారాయణ గౌడ్ తెలిపారు. నరసింహ ఉపవాసకులు బత్తిని రాములు గౌడ్ సహకారంతో దేవాలయంలో అభివృద్ధి పనులు మౌలిక వసతులు కల్పనకు కృషి చేస్తున్నట్లు, దేవాలయం వెలుగులోకి రావడానికి ఆయనే ప్రధాన కారణం అన్నారు.

అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రం పూర్ణగిరి: అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రం నమాత్ పెళ్లి పూర్ణగిరి దేవాలయం అని నందనం ఎంపిటిసి మట్ట పారిజాత శంకర్ బాబు అన్నారు. 2016 సంవత్సరంలో బత్తిని రాములు గౌడ్ అని స్వామివారి భక్తుడు ఈ క్షేత్రాన్ని వెలుగులోకి తీసుకువచ్చాడు. ఆయన ద్వారా భక్తులకు స్వామివారి లీలలు తెలియడంతో ఈ క్షేత్రం అనాతికాలంలోనే పవిత్ర పుణ్యక్షేత్రంగా అవతరించింది. చాలామంది దాతలు ముందుకు వచ్చారు. సోలిపురం శ్రీకాంత్ రెడ్డి, మొసలి ఉదయ్ కుమార్ రెడ్డి, రావి సురేందర్ రెడ్డి, ఎల్లంల శాలిని జంగయ్య యాదవ్ ల సహకారంతో ఆలయం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. స్వామివారి కృపా కటాక్షాలతోనే ఎంపిటిసి గా గెలిచి, ప్రజలకు సేవ చేసే భాగ్యం కలిగిందన్నారు.