
నిజామాబాద్ జిల్లాకు వ్యవసాయ డిగ్రీ కళాశాలను మంజూరు చేసిన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కి ప్రత్యేక ధన్యాదములు తేలుపుతున్నమని యూనివర్సిటి పరిశోధక విద్యార్థి సంఘం అధ్యక్షులు డాక్టర్.పుప్పలారవి అన్నారు. మంగళవారం వర్సిటీ లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల వద్ద యూనివర్సిటీ పరిశోధక విద్యార్థి సంఘం, నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా ఎన్ ఎస్ యుఐ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ పరిశోధక విద్యార్థి సంఘం అధ్యక్షులు డాక్టర్ పుప్పాల రవి మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాకు వ్యవసాయ డిగ్రీ కళాశాల మంజూరు చేసిన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నామని, అదేవిధంగా గతంలో మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు విజ్ఞప్తి మేరకు రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందిస్తూ నిజామాబాద్, నల్గొండ జిల్లాకు వ్యవసాయ డిగ్రీ కళాశాలను మంజూరు చేసినట్లు ప్రకటించారు. దీనితో నిజామాబాద్ జిల్లా వాస్తవ్యుల దశాబ్దాల కోరిక నెరవేరినట్లయిందని పేర్కొన్నారు.ఈ యూనివర్సిటీ కోసం గత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, జిల్లా ప్రజల కోరికలు నేడు ఫలించయని వివరించారు.బోదన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి చొరవ తీసుకొని ప్రయత్నాలు ముమ్మరం చేయగా, ఏనుగు రవీందర్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, రూరల్ నిజామాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతిరెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ దీని వెనుక కృషి చేసిన ప్రముఖులన్నారు. గత బడ్జెట్లో సిఎం యూనివర్సిటీల అభివృద్ధికి 500 కోట్ల రూపాయలు మంజూరు చేశారని, యూనివర్సిటీ కి 50 కోట్ల నిధులు మంజూరు చేసినటువంటి ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతి రెడ్డి కృషి ఎంతైనా ఉందన్నారు. నిజామాబాద్ జిల్లా వాసుల కలలు నెరవేర్చినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ ఎన్ ఎస్ యుఐ అధ్యక్షుడు కొమిర శ్రీశైలం, ప్రధాన కార్యదర్శి రాజేందర్, నిజామాబాద్ తెలంగాణ ఉద్యమకారుల సంఘ అధ్యక్షులు తర్ల లక్ష్మణ్, విద్యార్థులు వినయ్, భాస్కర్, బాలాజీ, అలియాస్ తదితరులు పాల్గొన్నారు.