క్రైస్తవులు అన్ని రంగాల్లో రాణించాలి : మేడే రాజీవ్‌ సాగర్‌

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
సమాజంలో క్రైస్తవులు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అన్ని రంగాల్లో రాణించాలని తెలంగాణ ఫుడ్స్‌ చైర్మెన్‌ మేడే రాజీవ్‌ సాగర్‌ ఆకాంక్షించారు. సుమారు రూ. 12 కోట్ల ప్రభుత్వ నిధులతో హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌ నగర్‌లోని బాప్తిస్ట్‌ చర్చిలో చేపట్టిన నిర్మాణ పనులను ఆదివారం ఆయన పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రార్థన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. చర్చి నిర్మాణానికి ప్రభుత్వం తరఫున అన్ని సహాయ సహకారాలు అందేలా కృషి చేస్తానని తెలిపారు. వ్యక్తిగతంగా తన వంతు ఆర్థిక సాయం చేస్తానని పేర్కొన్నారు. క్రైస్తవులు అంటే కేవలం టీచర్లు, నర్సులు, సిస్టర్లకే పరిమితం కాకుండా ఐఏఎస్‌లుగా, ఉన్నతాధికారులుగా, రాజకీయ నాయకులుగా మరింత ఉన్నతులుగా ఎదగాలని కోరారు . దేశంలో ఎక్కడా లేనివిధంగా కుల మతాలకు అతీతంగా అందరిని ప్రోత్సహిస్తూ వారి అభివద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్‌ ఇజ్రాయిల్‌ , సీనియర్‌ పాస్టర్‌ బోడా సాల్మన్‌ రాజ్‌, జూనియర్‌ పాస్టర్‌ శాంత్‌ కుమార్‌, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.