జంగపల్లిలో ఘనంగా సైన్స్ దినోత్సవం

నవతెలంగాణ – మిరు దొడ్డి 
అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞానాన్ని పెంచేది విజ్ఞాన శాస్త్రం ఎంతో జ్ఞానాన్ని పెంచుతుందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు సోమగారి నాగిరెడ్డి అన్నారు. అక్బర్ పేట భూంపల్లి మండలం జంగపల్లి  లోని ఉన్నత పాఠశాలలో  దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు సైన్స్ నమూనాలు, ప్రయోగాలు, రంగవల్లులు, ప్రహేళిక పోటీలను  నిర్వహించారు. విజేతలైన విద్యార్థులకు బహుమతులను ప్రధానం చేశారు. ప్రతి విద్యార్థి విద్యా విజ్ఞానం కలిగి ఉండాలని తెలిపారు. విద్యతో విద్యార్థులు ఉన్నత శిఖరానికి ఎదుగుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సిద్ధి వెంకటేష్, పేల రవి, కారంపుడి సౌజన్య, మరియు విద్యార్థులు పాల్గొన్నారు.