
– ఛైర్మన్ ప్రమాణ స్వీకారనికి హాజరైన ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి
నవతెలంగాణ – డిచ్ పల్లి
ఖిల్లా డిచ్ పల్లి సహకార సొసైటీ చైర్మన్ గా డిచ్ పల్లి మండలం లోని యానంపల్లి గ్రామానికి చెందిన ఎం రామచందర్ గౌడ్ బుదవారం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బీసీలు ఉన్నవారందరికీ అభివృద్ధి చేయడానికి కుల గణన చేపట్టడానికి అసెంబ్లీలో తీర్మానం చేసిన బీజేపీ బీసీ కులఘననను ఒప్పుకోవడం లేదన్న గతంలో ఓసీగా ఉన్న మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీగా చేసుకొని లబ్ధి పొందాలని అన్నారు. రైతులకు మద్దతు ధర కల్పించడానికి గతంలోని ఎజెండలో పెట్టామని దానికి చట్టబద్ధత కల్పిస్తామన్నారు. పసుపు బోర్డు తెస్తానని పేపర్ మీద ప్రకటించారని కానీ నేటి వరకు పసుపు బోర్డు కు అతిగతి లేదని విమర్శించారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే రైతులకు న్యాయం జరుగుతుందని మద్దతుగా ఇవ్వకుండానే డిమాండ్ల సాధనకు ఆందోళన చేస్తున్న రైతులపై బీజేపీ ప్రభుత్వం కాల్చి చంపుతుందన్నారు. వచ్చే పార్లమెంట్ మున్సిపల్ జిల్లా పరిషత్ మండల పరిషత్ సర్పంచ్ ఎన్నికలకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని, కాంగ్రెస్ గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ కలుగుతుందని, గత పది ఏళ్ల టిఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో అవినీతి రాజ్య మెలిందని, రైతు రుణమాఫీ చేయలేదని,యసంగి సమయంలో రైతులు వద్ద కోనుగోలు చేసిన వరి పది కిలోల మేర కోత పెట్టారని విమర్శించారు. దేశంలో వేలాది ఆలయాలు ఉన్న ఒక్క రామల నిర్మించి ఆ పేరుపైనే కోట్లు దండుకునే విధంగా చూస్తున్నారని మోడీ రాకముందు తమంత నాటి నుండి నేటి వరకు జైశ్రీరామ్ అంటునే ఉంటామని, అభివృద్ధి చేసి కోట్లు అడగాలి తప్ప కులాలు మతాల మధ్య చిచ్చుపెట్టి లబ్ధి పొందొద్దని ఎమ్మెల్యే సూచించారు. టిఆర్ఎస్ బిజెపి రెండు ఒకటేనని ఎమ్మెల్యే ఆరోపించారు. అంతకుముందు
డిసిఓ కార్యాలయ అధికారి బుచ్చన్న నూతన చైర్మన్ రాంచందర్ గౌడ్ చే ప్రమాణ స్వీకారం చేయించారు. ఎమ్మెల్యే చైర్మన్ ను శాలువా తో సత్కరించారు.ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్లు, వైస్ చైర్మన్ కుమ్మరి చిన్న గంగారం, సొసైటీ సీఈవో కిషన్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు అమృత పూర్ గంగాధర్, నాయకులు కంచెట్టి గంగాధర్, పొలసాని శ్రీనివాస్, బూస సుదర్శన్, ఏజి దాస్, డాక్టర్ షాదుల్లా, న్యాస రాజేశ్వర్, డిసిఓ కార్యాలయ అధికారి పోచన్న, రాష్ట్ర నాయకులు శేఖర్ గౌడ్, మాజీ ఐడిసిఎంఎస్ చైర్మన్ మునిపల్లి సాయిరెడ్డి, దర్మగౌడ్, ఎంపిటిసి నర్సయ్య, నాయకులు కార్యకర్తలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.