నవతెలంగాణ – సిరిసిల్ల
సిరిసిల్ల ఆర్డీఓ ఎన్.ఆనంద్ కుమార్ ను కోరుట్ల ఆర్డీఓ గా, వేములవాడ ఆర్డీఓ మధుసూధన్ ను జగిత్యాల ఆర్డీఓ గా బదిలీ చేస్తూ రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ నవీన్ మిట్టల్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. హన్మకొండ ఆర్డీఓగా విధులు నిర్వర్తిస్తున్న ఎల్.రమేష్ ను సిరిసిల్ల ఆర్డీఓగా, కోరుట్ల ఆర్డీఓగా విధులు నిర్వర్తిస్తున్న ఎస్.రాజేశ్వర్ ను వేములవాడ ఆర్డీఓ గా బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.