సివి రామన్ ఎఫెక్ట్ ఆవిష్కరణ సందర్భంగా జాతీయ వైజ్ఞానిక దినోత్సవాన్ని పురస్కరించుకొని ముత్తారం మండలం అడవీ శ్రీరాంపూర్ జడ్పిహెచ్ఎస్ పాఠశాలలో విద్యా వైజ్ఞానిక మేళాను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గుండె పని చేయు విధానం, అందలి భాగములు, ఊపిరితిత్తుల పని తీరు, అందలి భాగాలు, కిడ్నీ పని తీరు తదితర ప్రయోగాలను కె.మహిపాల్ రెడ్డి ప్రయోగపూర్వకంగా వివరించారు. అనంతరం విద్యార్థులు స్వయంగా తయారు చేసిన వివిధ ప్రయోగాలను అతిథులకు వివరించారు. రక్ష పరీక్షలు, గ్రూపులు వివరించి, స్వయంగా పరీక్ష చేశారు. ఇలాంటి ప్రయోగాల ద్వారా విద్యార్థులలో శాస్త్రీయ దృక్పథం ఏర్పడుతుందని, అలాగే ప్రతి విద్యార్థి నిత్య జీవితంలో శాస్త్రీ విజ్ఞానం పట్ల అవగాహన పెంచుకోవాలని, మూఢ నమ్మకాలు విడనాడి, ఆరోగ్య, ఆహార అలవాట్లు కలిగి ఉండాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఓదెలు వివరించారు. కార్యక్రమంలో స్థానిక ప్రైవేట్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గని తిలకించి, శాస్త్రియ విజ్ఞానం పట్ల అవగాహన పొందారు. కార్యక్రమంలో విద్యాభిలాషులు సిహెచ్.సాగర్, పూర్వ ఎస్ఎంసి చైర్మన్ పి.చక్రపాణి, గ్రామస్తులు, పాఠశాల ఉపాధ్యాయులు పి.సదానందం, రాజయ్య, మహిపాల్ రెడ్డి, నర్సింహ రెడ్డి, శ్రీనివాస్, రాంరెడ్డి తదితరులున్నారు.
అడవీ శ్రీరాంపూర్ జడ్పిహెచ్ఎస్లో విద్యా వైజ్ఞానిక మేళా
నవతెలంగాణ – ముత్తారం