మేడిగడ్డ బ్యారేజీనా?బొందల గడ్డనా?

Madigadda Barrage? Bondala Gadda?– కేసీఆరే సమాధానం చెప్పాలి
– టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు జగ్గారెడ్డి ఎద్దేవా
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
‘మేడిగడ్డనా? బొందలగడ్డనా? ఏం పీకడానికి మేడిగడ్డకు పోతున్నారు’ అంటూ మాజీ సీఎం కేసీఆర్‌ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడిగడ్డనో, బొందలగడ్డనో కేసీఆర్‌ చెప్పాలని డిమాండ్‌ చేశారు. సీఎంగా పని చేసిన ఓ వ్యక్తి అలాంటి మాటలు మాట్లాడటం సమంజసమేనా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. 70 ఏండ్ల కేసీఆర్‌కే అంత కోసం వస్తే…యంగ్‌ డైనమిక్‌ సీఎం రేవంత్‌ రెడ్డికి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు ఆవేశం రాదా? అని ప్రశ్నించారు. కేసీఆర్‌ చేసిన అవినీతిని బయటపెట్టడానికే తాము మేడిగడ్డకు వెళ్లామని తెలిపారు. ‘కేటీఆర్‌, మీ నాన్నకు అలా మాట్లాడకూడదని బుద్ది చెప్పాలి’ అని సూచించారు. అది బొందల గడ్డ కాదని, మేడిగడ్డ ప్రాజెక్టు అని వివరంగా కేసీఆర్‌కు చెప్పాలంటూ హరీశ్‌రావుకు సూచించారు. ఈ విషయాన్ని బొందలగడ్డతో పోల్చిన కేసీఆర్‌ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం మేడిగడ్డకు రమ్మన్నప్పుడు కేసీఆర్‌ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ఇప్పుడు బీఆర్‌ఎస్‌మీరు రమ్మంటే తామెందుకు వస్తాం? అని కౌంటర్‌ ఇచ్చారు. కడియం శ్రీహరి గురించి మాట్లాడటం సమయం వృథ్దా అని, బాల్క సుమన్‌ ఒక బచ్చా అని ఎద్దేవా చేశారు. శ్రీరాముడు బీజేపీలో కొంతమందికే దేవుడా? అని ప్రశ్నించారు. శ్రీరాముడు తన తల్లిని గౌరవించే మహానుభావుడని, తల్లి మాటలు కాదనకుండా వనవాసానికి పోయిన గొప్ప వ్యక్తి అని అన్నారు. కానీ బండి సంజరులో రాముడి విలువలు ఏమాత్రం లేవని విమర్శించారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌ తల్లిపై చేసిన వ్యాఖ్యలకు బండి సంజరు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. రాముడికున్న చరిత్రను దిగజారుస్తున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
మేడిగడ్డ పర్యటన ఎందుకోసం? బీఆర్‌ఎస్‌ నేతలకు నిరంజన్‌ ప్రశ్న
మేడిగడ్డ ప్రాజెక్టు పర్యటన ఎందుకోసం చేయబోతున్నారని టీపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షులు జి నిరంజన్‌ బీఆర్‌ఎస్‌ నేతలను ప్రశ్నించారు. ఆ పార్టీ ఈ పేరుతో మరో కొత్త డ్రామాను ప్రారంభించిందని ఎద్దేవా చేశారు. బుధవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు రుసుం తీసుకోవద్దంటూ మాజీ మంత్రి హరీశ్‌రావు సలహాలు ప్రభుత్వం ఇవ్వడం హాస్యస్ప దమని వివర్శించారు. అందుకోసం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎందుకు రుసుం తీసుకున్నదని ప్రశ్నించారు. మేడిగడ్డకు అన్ని పార్టీల ఎమ్మెల్యేలను తీసుకెళ్లినప్పుడు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. ప్రజల దృష్టిని మరల్చేం దుకే బీఆర్‌ఎస్‌ మేడిగడ్డ పర్యటనకు వెళ్తుతున్నారని ఎద్దేవా చేశారు.