ఐదుగురు ఐఏఎస్‌ల బదిలీ

Transfer of five IAS– 8 మంది స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్లు, 32 మంది డిప్యూటీ కలెక్టర్లకు స్థానచలనం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో ఐఏఎస్‌ అధికారుల బదిలీల పర్వం కొనసాగుతూనే ఉంది. బుధవారం మరో ఐదుగురు ఐఏఎస్‌ అధికారులకు స్థాన చలనం కలిగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. అదిలాబాద్‌ కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌ను మెదక్‌కు బదిలీ చేశారు. కుమ్రం భీం ఆసిఫాబాద్‌ కలెక్టర్‌గా ఉన్న బీహెచ్‌ సహదేవ్‌రావును జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్‌గా, నల్లొండ అదనపు కలెక్టర్‌ హేమంత కేశవ పాటిల్‌ను హైదరాబాద్‌ అదనపు కలెక్టర్‌గా నియమించారు. పోస్టింగ్‌ కోసం ఎదురు చూస్తున్న రాజర్నిషాను అదిలాబాద్‌ కలెక్టర్‌గా,స్నేహ శబరీశ్‌ను కుమ్రం భీం ఆసిఫాబాద్‌ కలెక్టర్‌గా నియమించారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 8 మంది స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్లు, 32 మంది డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేశారు. పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన మార్గదర్శకాల మేరకే ఈ బదిలీలు జరిగినట్టు సమాచారం.