జార్ఖండ్‌లో ఘోర రైలు ప్రమాదం

Fatal train accident in Jharkhand

– 12మంది మృతి..
– రైల్వేట్రాక్‌ దాటుతున్న వ్యక్తులను ఢకొీనడంతో..
రాంచీ: జార్ఖండ్‌లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. రైల్వే ట్రాక్‌ దాటుతున్న వ్యక్తులను బెంగళూరు -భాగల్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఢీకొీట్టింది. ఈ దుర్ఘటనలో 12 మంది చనిపోయినట్టు సమాచారం. ఇప్పటివరకు ముగ్గురి మృతదేహాలను గుర్తించారు. ప్రమాదం జరిగిన చోట చీకటిగా ఉండటంతో.. సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని రైల్వే అధికారులు తెలిపారు. అనసోల్‌ పరిధి జంతారా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అప్రమత్తమైన సిబ్బంది ఘటనాస్థలానికి వైద్య బృందాలను, అంబులెన్స్‌లను తరలించారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.