మానవ సేవే మాధవ సేవ: బుసిరెడ్డి ఫౌండేషన్

నవతెలంగాణ – పెద్దవూర
సేవాతత్పరుడు నాగార్జునసాగర్ ముద్దుబిడ్డ మన బుసిరెడ్డి ఫౌండేషన్  ఛైర్మన్ – బుసిరెడ్డి పాండురంగారెడ్డి నేనున్నానంటూ భరోసా కల్పించడమే గాక అందరికి మనోధైర్యాన్ని ఇస్తూ అండగా నేను వుంటా అంటూ అన్ని విధాలా ఆదుకుంటా అని అంత్యక్రియల అనంతరం భోజనాలు పంపిస్తున్న సేవాతత్పరుడు పాండు రంగారెడ్డి. నల్గొండ జిల్లా, నాగార్జునసాగర్ నియోజకవర్గం, త్రిపురారం మండలం,పలుగు తండా గ్రామంలోని గిరిజన కులస్తులు అయినటువంటి పానుగోతు మంగ్తా నాయక్ (70) సంవత్సరాలు స్వర్గస్తులు అయ్యినారని గురువారం తెలుసుకొని ఆ కుటుంబానికి అండగా  బుసిరెడ్డి ఫౌండేషన్ వారు అంత్యక్రియలు అనంతరం భోజనాలు పంపించారు. ఆర్ధికంగా ఇబ్బందివున్న నిరుపేద కుటుంబాలకి మన బుసిరెడ్డి ఫౌండేషన్ ఎల్లపుడూ అన్నదానం చేయడానికి సిద్ధంగా ఉంటుందని బుసిరెడ్డి పాండురంగారెడ్డి గారు పిలుపునిచ్చారు. సహాయం కోసం టోల్ ఫ్రీ నెంబర్ 9581742356 కు సంప్రదించవలసినదిగా కోరారు. నలుగురిని ఆదరిద్దాం అనే సదుద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.