మండల కేంద్రంలో మహిళా సమాఖ్య ఈసీ సభ్యుల సమావేశం

నవతెలంగాణ – మోపాల్

గురువారం రోజున మోపాల్ మండల కేంద్రంలో  మహిళా సమాఖ్య ఈసీ సభ్యుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా బ్యాంక్ లింకేజీ లక్ష్యం రూ.37.55 కోట్లు ఉండగా మార్చి నెల నాటికి 35 కోట్ల వరకు రికవరీ సాధ్యమైందని ఇంకా రూ.2.55 కోట్ల లక్ష్యాన్ని 15 రోజుల్లో పూర్తి చేసుకోవాలని నిర్దేశించుకోవడం జరిగింది. అదేవిధంగా శ్రీనిధి లక్ష్యాన్ని కూడా మార్చి 15వ తేదీ వరకు చేరుకోవాలని నిర్ణయించుకోవడం అయింది. రుణాల రికవరీ లో మహిళా భాగస్వామ్యాన్ని 100% రికవరీని సాధించుకోవాలని నిర్ణయించడమైనది. ఈ కార్యక్రమంలో ఏపీఎం మోహన్ 29 గ్రామ సంఘాల ప్రతినిధులు పాలకవర్గ సీసీలు తదితరులు పాల్గొన్నారు.