యువతి అదృశ్యం

నవతెలంగాణ- వలిగొండ రూరల్
యువతి అదృశ్యమైన ఘటన మండలంలోని గోకారంలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని గోకారంకు చెందిన నారి అశోక్ చిన్న కుమార్తె మనీషాకు 2020 వ సంవత్సరంలో రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలంలోని మసీద్ గూడెం గ్రామానికి చెందిన గుత్తా శ్రీశైలంతో వివాహమైoది. అటు తర్వాత 6 నెలల క్రితం  ఈమెకు విడాకులు తీసుకొని అప్పటి నుండి తల్లిదండ్రుల ఇంటి వద్ద గోకారంలో ఉంటుంది. ఈ నెల 23 వ తేదిన సూర్యాపేటలో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లివస్తూ బుధవారం అదృశ్యమైందన్నారు. బంధువుల ఇండ్లల్లో తెలిసిన వారి ఇండ్లలో ఎక్కడ  వెతికిన యువతి ఆచూకి లభ్యం కాకపోవడంతో యువతి కుటుంబ సభ్యులు గురువారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహేందర్ తెలిపారు.