మట్టిలో మాణిక్యాలు తాడికల్ ఆణిముత్యాలు

– గురుకులంలో జాబ్ సాధించిన ప్రత్యూష, అశోక్
నవతెలంగాణ – శంకరపట్నం
శంకరపట్నం మండల పరిధిలోని తాడికల్ గ్రామానికి చెందిన పేదింటి బిడ్డలు ఉన్నత చదువు లతో ముందుకు సాగి ఎలాగైనా జాబు సాధించే లక్ష్యంతో గురుకులంలో జాబ్ సాధించిన మట్టిలో మాణిక్యాలు  ప్రత్యూష, పాండ్రాల అశోక్,ఒకరు గురుకుల డిగ్రీ లెక్చరర్ గా మరొకరు గురుకుల జూనియర్ లెక్చరర్ గా ఉద్యోగం సాధించి తాము పుట్టిన ఊరికి పేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చారు. ఇటీవల విడుదలైన గురుకులం డిగ్రీ కాలేజ్ లెక్చరర్ ఫలితాల్లో పేదింటి ఆడబిడ్డ యువ ఆణిముత్యం తాడికల్ గ్రామము  నుండి కొరిమి ప్రత్యూష కాగా ఈమె ఆంగ్లం లో గతం లొనే ఐఎఫ్ ఎల్ యులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి అతి కఠినతరం అయిన యుజిసి నెట్ సాధించారు. ప్రస్తుతం పీహెచ్డీ కూడా చేస్తూ ఉన్నారు. ఈ ఎంపిక తాడికల్ గ్రామానికి ఒక మంచి పేరును తెచ్చింది అలాగే మరో పేదింటి బిడ్డ గురుకుల జూనియర్ లెక్చరర్ గా తాడికల్ గ్రామానికి చెందిన యువ ఆణిముత్యం పాండ్రాల అశోక్ ఎంపికై గ్రామానికి మంచి గుర్తింపు తీసుకువచ్చారు. అశోక్ గణితంలో ఉస్మానియాలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి అతి కఠినమైన సెట్ సాధించారు. ఈ సందర్భంగా వీరిని గ్రామస్తులు విద్యావేత్తలు అభినందిస్తున్నారు.