నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
శ్రీ శ్రీ సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిన అవసరం ఉందని నల్గొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. శ్రీశ్రీశ్రీ సద్గురు సంత్ సేవాలాల్ మహరాజ్ 285 జయంతి ఉత్సవాలను గురువారం నల్గొండ పట్టణంలోని క్లాక్ టవర్ సెంటర్ వద్ద గృహ నిర్మాణ శాఖ పీడీ, ఇన్చార్జి డిటిడబ్ల్యు రాజ్ కుమార్ అధ్యక్షత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతి ఒక్కరు సంత్ సేవాలాల్ మహరాజ్ ఆశయ సాధనకు కృషి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. సంత్ సేవాలాల్ మహారాజ్ సామాజిక సంఘసేవకర్త మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక గురువు అని అన్నారు. ఈ కార్యక్రమంలోఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు రాంబాబు నాయక్, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్, ఆల్ ఇండియా బంజారా సేవ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రనాయక్, జిల్లా అధ్యక్షులు ప్రవీణ్, జెడ్పిటిసి లక్ష్మయ్య, వార్డు కౌన్సిలర్ ప్రదీప్ నాయక్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ శంకర్ నాయక్, బంజారా ఉద్యోగ సంఘం జిల్లా అధ్యక్షులు జగన్ సింగ్, గిరిజన ఉద్యోగ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవి నాయక్, ఎల్ హెచ్ పి ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సకృ నాయక్, బంజారా సేవా సంఘం రాష్ట్ర నాయకులు ప్రేమా నాయక్, జనరల్ సెక్రెటరీ బిక్కు నాయక్, ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్, అడిషనల్ ఎస్పీ రాములు నాయక్, జిల్లా లీగల్ అడ్వైజర్ నాగార్జున నాయక్, కార్మిక సంఘం అధ్యక్షులు నగేష్, జిల్లా పరిశ్రమల మేనేజర్ కోటేశ్వరరావు, డిసిహెచ్ఎస్ మాతృ నాయక్, జిల్లా అధికారులు ఈఈ శ్రీనివాస్ నాయక్, సిపిఓ మాన్య నాయక్ తదితరులు పాల్గొన్నారు.