మట్టిని బువ్వగా
మలిచిన అన్నదాతపై
మోడీ రాజ్యం ముప్పేట దాడి చేస్తోంది
లాఠీ దెబ్బలు, తూటాల వర్షం కురిపిస్తోంది
ఇదేనమూనా రామరాజ్యం
శ్రమకు ఫలితం యేదని
కర్షకులు ఉద్యమిస్తే
వాళ్ల కన్నీళ్ళని చూడలేని
ఈ కబోది రాజ్యం
ముమ్మాటికీ కాషాయ ఉన్మాద రాజ్యమే
కార్పొరేట్ పాద సేవలో తరిస్తూ
ఏ గడ్డి కరిచైనా మళ్లీ గెలవాలనుకుంటుంది
రైతుకు భరోసా, పంటకు మద్దతు ధర ఇవ్వకుండా మరణ శాసనాన్ని లిఖిస్తోంది
నల్ల చట్టాలను వెలికితీసి
రైతు బతుకుకి ఉరితాళ్లు పేనుతుంది
ఇదే రామరాజ్యమైతే
ఆ రాజ్యం మనకొద్దు
ఆ ప్రభువులు అసలే వొద్దు
రైతు రాజ్యం కావాలి
రైతును ఉగ్రవాదిగా చూసి
దేశద్రోహిగా చూపెడుతున్న పాలనపై
కాసింత కాండ్రించి ఉమ్మేయండి
కసిగా పౌరుషాన్ని చూపండి
న్యాయమడిగితే
కసాయి తనాన్ని చూపెడుతూ
మట్టి బతుకును చిధ్రం చేస్తున్న
ఆ కసాయి గుండెను
నాగలి కొనతో చీల్చి చెండాడాలి
రైతును బతికించడం కోసం
ఆత్మ గౌరవాన్ని నిలపడం కోసం
ఎర్రజెండాలై లేవండి
ప్రజా కంఠకులను తరమండి
– మామిండ్ల రమేష్ రాజా,
7893230218