తెలంగాణ నాన్ గెజిటెడ్ వెటర్నరీయన్స్ డైరీ ఆవిష్కరణ….

నవతెలంగాణ – భువనగిరి రూరల్
యాదాద్రి భువనగిరి జిల్లాలో తెలంగాణ నాన్ గెజిటెడ్ వెటరినేరియన్స్ అసోసియేషన్ డైరీ 2024 ను పశుసంవర్ధక శాఖ జిల్లా అధికారి డాక్టర్ వి కృష్ణ, నూతన జిల్లా ఇంచార్జ్ డాక్టర్ సదానందంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ ఏడి డాక్టర్ ఐలయ్య, నరేందర్, జిల్లా గౌరవ అధ్యక్షులు పెండెం శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి భూష బోయిన నరసింహ యాదవ్, కోశాధికారి రాంపాక నరేష్, ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీశైలం, సహాయ కార్యదర్శి బి మల్లేష్, ఆస్మా, దామోదర్, కార్యవర్గ సభ్యులు, ఉద్యోగులు పాల్గొన్నారు.