వ్యవసాయ మార్కెట్ ఛైర్మన్ బరిలో కవిత.?

నవతెలంగాణ – అచ్చంపేట 

వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ గా మండల కేంద్రానికి చెందిన చింత గాళ్ళ శ్రీను భార్య కవిత బరిలో ఉన్నారు. ఛైర్మన్ పదవిని ఈసారి ప్రభుత్వం ఎస్సీ మహిళకు రిజర్వ్ చేశారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే తర్వాత  ఫ్రోటో కాల్ విలువగల పోస్టు వ్యవసాయ మార్కెట్ చైర్మన్. ఇంతటి ప్రాధాన్యత ఉండడంతో ఛైర్మన్ గిరిపైన పలువురు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ ఎవరికి మొగ్గు చూపుతారని  ఆహశావహులు ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో చాలా ఏళ్లుగా పార్టీ అభివృద్ధి కోసం  మండల కేంద్రంలో చింతగాళ్ళ   శ్రీను,  కవిత తీవ్రంగా కృషి చేశారు. వివిధ గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ పటిష కోసం, బూతు స్థాయి కమిటీలను నిర్మాణం చేయడంలో వీరు తీవ్రంగా కృషి చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి సర్పంచిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. అయినప్పటికీ నిరుత్సవపడకుండా కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం అలిపిరిగాని కృషి చేశారు కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు కట్ట అనంతరెడ్డి వీరికి పూర్తి సహకారం ఉంది.

 ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో చాలామంది నామిటేటెడ్ పదవులపై ఆశలు పెంచుకున్నారు. వాస్తవానికి అధికారంలో లేనప్పుడు గ్రామస్థాయిలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేసిన కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరం ఉందని కాంగ్రెస్ పార్టీ అభిమానులు,  శ్రేయోభిలాషులు అభిప్రాయ వ్యక్తం చేస్తున్నారు. సిహెచ్ కవితను మార్కెట్ చైర్మన్ గా నియమించాలని మండల కేంద్రానికి చెందిన యూత్ కాంగ్రెస్ నాయకులు, బోల్లె లక్ష్మయ్య, శేఖర్ గౌడ్,  బొల్లె నరసింహ పలువురు డిమాండ్ చేస్తున్నారు.