నవతెలంగాణ – మోపాల్
తెలంగాణ జే ఏ సి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం సార్ గారితో చర్చలు ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ కోసం ముందుగా నిర్వహించే ఉపాధ్యాయుల అర్హత పరీక్ష (టెట్ )లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కు అర్హులైన అగ్రవర్ణ పేదలకు కూడా బీసీ అభ్యర్థుల మాదిరిగా అర్హత మార్కులు తగ్గించాలని రెడ్డి ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు ఏనుగు సంతోష్ రెడ్డి ,స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి తో కలిసి పెద్దలు కోదండరాం ద్వార రాష్ట్ర ముఖ్య మంత్రి దృష్టికి తీసుకెళ్లి కటాఫ్ మార్కులు తగ్గించాలని కోరటం జరిగింది . తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం నిర్వహించే పోటీ పరీక్షల్లో అర్హత సాధించాలంటే ముందుగా ప్రతి ఒక్క బీఈడీ, టిటిసి చేసిన అభ్యర్థులు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్ )లో అర్హత సాధించాల్సి ఉంది. కావున ఈ ఉపాధ్యాయ అర్హత పరీక్షలో ఓసి అభ్యర్థులకు 90 మార్కులు, బీసీ అభ్యర్థులు 70 మార్కులు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు 60 మార్కులు సాధించాలి. దీంతో 89 మార్కులు సాధించిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అర్హత కలిగిన అభ్యర్థులు ఒక్క మార్కుతో వేల సంఖ్యలో అభ్యర్థులు, ఉపాధ్యాయ పోస్టుల కొరకు నిర్వహించే పరీక్షల్లో తీవ్ర అన్యాయం జరుగుతుంది. కావున ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ కు అర్హత కలిగిన అగ్రవర్ణ పేదలకు కూడా బీసీ అభ్యర్థుల మాదిరిగా 75 మార్కులకే టెట్ అర్హత పరీక్ష మార్కులు తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఈ సమస్యపై దృష్టి సారించి పరిష్కరించి అర్హులైన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అభ్యర్థులకు తగిన న్యాయం చేయాలని రెడ్డి ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు ఏనుగు సంతోష్ రెడ్డి కోరారు.