
ప్రస్తుతం వేసవికాలం ఉన్నందున గ్రామాలలో తాగునీటి సమస్యలు రాకుండా ఉండడానికి తాగునీటి పంపిణీ సక్రమంగా నిర్వహించడానికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారి రవీందర్ సూచించారు.శుక్రవారం డిచ్ పల్లి మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, త్రాగు నీటి అధికారులతో యాక్షన్ ప్లాన్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవికాలంలో ఎం గ్రామమైన తాగునీటి సమస్యలు రాకుండా ఉండడానికి ముందస్తు చర్యలు చేపట్టాలని, తాగునీటి పంపిణీని సక్రమంగా నిర్వహించడానికి ఈయాక్షన్ ప్లాన్ ఎంతగానో ఉపయోగపడుతుందని వివరించారు.ఈ సమావేశం లో తహసిల్దార్ ప్రభాకర్, ఆర్డబ్ల్యూఎస్ డిప్యూటీ ఈ ఈ ధర్మేంద్ర, పంచాయతీరాజ్, ఆర్ డబ్ల్యు ఎస్ ఎఈ లు, ఎంపీఓ శ్రీనివాస్ గౌడ్, మండలంలోని ఆయా గ్రామాల ప్రత్యేక అధికారులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.