నవతెలంగాణ – బొమ్మలరామారం
కాంగ్రెస్ ప్రభుత్వం లో పేద ప్రజల కు న్యాయం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు మన్నెం నరేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని తూంకూంట గ్రామంలో ప్రభుత్వ ప్రైవేశ పెట్టిన గృహలక్ష్మి పథకం లో భాగంగా జిరో విద్యుత్ బిల్లు ను ప్రజలకు అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేస్తూందని ఆయన అన్నారు. ఈకార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు మేకల శ్రీశైలం, నాయకులు లక్ష్మయ్య, వెంకటేశం, సలీం, సురేష్, నాగేష్ తదితరులు పాల్గొన్నారు.