గాలికుంటు వ్యాధి నివారణకు టీకాలు

నవతెలంగాణ – ఉప్పునుంతల

ఉప్పునుంతల మండలం వెల్టూరు గ్రామంలో శనివారం నిర్వహించిన గాలికుంటు వ్యాధి నివారణకు గ్రామంలో 216 పశువులకు టీకాలు వేసినట్లు మండల వైద్యాధికారి డాక్టర్ కె నరేందర్ తెలిపారు. రైతులు ఈ కార్యక్రమాన్ని అందుబాటులో ఉండి సాద్వినియోగం చేసుకోవాలని కోరారు. సోమవారం రోజు పిరాట్వానిపల్లీ గ్రామంలో నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది కమల, బాలకోటి, చెన్నయ్య, ఎండి హబీబ్ పాల్గొన్నారు.