దేవాలయ కమిటీ ప్రమాణ స్వీకారం..

నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయ కమిటీ నూతన అధ్యక్షులు పాలకవర్గ సభ్యులతో శనివారం యాదాద్రిభువనగిరి జిల్లా దేవదాయ శాఖ ఇన్స్పెక్టర్ బి.సుమతి ప్రమాణ స్వీకారం చేయించారు. నూతన అధ్యక్షులుగా కొలను మధుసూదన్ పాలకవర్గ సభ్యులు ధర్మకర్తలుగా సుర్కంటి మోహన్ రెడ్డి,పొట్టబత్తిని హరికృష్ణ,జెల్లా లలిత,ఎర్రగుంట సర్వయ్య, వర్కాల సత్యనారాయణ దేవదాయ శాఖ ఇన్స్పెక్టర్ బి.సుమతి ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షులు కొలను మధుసూదన్ మాట్లాడుతూ శివరాత్రి సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిపిస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కొయ్యలగూడెం ఎంపిటిసి జెల్లా ఈశ్వరమ్మవెంకటేశం మాజీ సర్పంచులు గుర్రం కొండయ్య,మాచర్ల కృష్ణ చేనేత సహకార సంఘం అధ్యక్షులు గడ్డం జయశంకర్ అఖిలభారత పద్మశాలి సత్రం అధ్యక్షులు వర్కాల సూర్యనారాయణ దేవాలయ మాజీ అధ్యక్షులు గడ్డం యాదగిరి తదితరులు పాల్గొన్నారు.