డిండిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

నవతెలంగాణ – డిండి
డిండి మండలంలో పలు అభివృద్ధి పనులకు స్థానిక శాసనసభ్యులు నేనావత్ బాలునాయక్ శనివారం శంకుస్థాపన చేశారు ఉదయం 09:00గంటలకు, కందుకూరు గ్రామంలో CC రోడ్డు, రహమంతాపూర్  లో CC రోడ్డు, వావిల్ కొల్ నుంచి బ్రాహ్మణపల్లి వరకు SDF నిదులచే బిటి రోడ్డు, బ్రాహ్మణ పల్లి గ్రామంలో కాంగ్రెస్స్ పార్టీ జెండా కార్యక్రమం చేయనున్నారు, సింగరాజుపల్లీ గ్రామంలో CC రోడ్డు, తవకలాపూర్ గ్రామంలో CC రోడ్డు, డిండి (గుండ్లపల్లీ) గ్రామంలో CC రోడ్డు, గోనకొల్ గ్రామంలో CC రోడ్డు, ప్రతాప్ నగర్ గ్రామంలో CC రోడ్డు, గోనబోయినపల్లి గ్రామంలో CC రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో యంపిపి మాధవరం సునీత జనార్దన్ రావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు డి. వెంకటేశ్వరరావు, నల్లవెల్లి రాజేష్ రెడ్డి, భగవంతరావు, యాదగిరిరావు, వీరకారి రామ్ కిరణ్, లక్పతినాయక్, సిపిఐ నాయకులు తూంబుచ్చిరెడ్డి, సోమిరెడ్డి సీనయ్య, ఎండి మైనొద్దీన్ తదితరులు పాల్గొన్నారు.