
చౌటుప్పల్ పిఎసిఎస్ చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని తెలియడంతో ఆయన చైర్మన్ పదవికి అర్హత కోల్పోయారని యాదాద్రిభువనగిరి జిల్లా కోపరేటివ్ అధికారి శనివారం తెలిపారు.చౌటుప్పల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి 750 మెట్రిక్ టన్నుల ధాన్యం గోదాం నిర్మాణంలో అక్రమాలకు పాల్పడడంతో,అనుమతి లేకుండా ఉద్యోగాల నియామకాలు చేపట్టారని పలు అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని ఆయన అవినీతిపై వైస్ చైర్మన్ చెన్నగోని అంజయ్య గౌడ్ జిల్లా కోపరేటివ్ సొసైటీ అధికారికి తేది:8.01.2024 ఫిర్యాదు చేయడంతో అవినీతి రుజువు కావడంతో చైర్మన్ పదవి నుండి చింతల దామోదర్ రెడ్డిని తొలగించి వైస్ చైర్మన్ అయినా చెన్నగోని అంజయ్య గౌడ్ కి చైర్మన్ గా పూర్తి బాధ్యతలు అప్పగించారు. మునుగోడు నియోజకవర్గం అభివృద్ది ప్రధాత శాసన సభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నాయక త్వంలో చౌటుప్పల్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం కార్యాలయంలో చౌటుప్పల్ సింగిల్ విండో చైర్మన్ గా నూతనంగా ఎన్నికైన చెన్నగోని అంజయ్య గౌడ్ సీఈఓ రమేష్ ఆధ్వర్యంలో పదవి బాధ్యతలు చేపట్టారు.నూతనంగా ఎన్నికైన చె న్నగోని అంజయ్య గౌడ్ ను ఘనంగా అభినందించా రు.ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు నాయకులు వైస్ ఎంపిపి ఉప్పు భద్రయ్య చౌటుప్పల్ బ్లాక్ మండల మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆకుల ఇంద్రసేన రెడ్డి,బోయ దేవేందర్,సుర్వి నరసింహ గౌడ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పబ్బు రాజుగౌడ్,ఉబ్బు వెంకటయ్య,కాసర్ల శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిలర్ కొయ్యడ సైదులు,పిల్లలమరి శ్రీనివాస్,చిట్టెంపల్లి శ్రీనివాసరా వు,బొబ్బిళ్ళ మురళి,మొగుదాల రమేష్ గౌడ్,రావుల స్వామి,అంతటి బాలరాజు,సందగళ్ల సతీష్, మాధగొని శేఖర్ గౌడ్,రాచకొండ భార్గవ్,తడక కిరణ్,ఆవుల యేసు,చింతల సాయిలు,ఎజాస్, కొండూరు వెంకన్న,గుండు మల్లయ్య గౌడ్ తదితర ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.