నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణ గ్రామాల్లో నిర్వహించే జాతర్లలో మాట్లాడే భాషకు అర్ధం తెలిపే సాంస్కృతిక పదకోశాన్ని శనివారం హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామీణ వారసత్వాన్ని భవిష్యత్ తరాలకు అందించేందుకు తెలంగాణ సాహిత్య అకాడమీ ఎన్నో వ్వయప్రయాసలకు ఓర్చి పదకోశాన్ని ముద్రించడం అభినం దనీయమని పేర్కొన్నారు. గ్రామ జాతర్లలో పలికే భాషను వ్యవహారిక భాషగానే రాసి, మంచి గ్రంథాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చిన రచయితలను, గ్రంథ సంపాదకులను, అభినందించారు. ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ సంచాలకులు కె. నిఖిల, తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్ బాలాచారి, డాక్టర్ రాపోలు సుదర్శన్, తదితరులు పాల్గొన్నారు.