ప్రజావాణిలో మౌలిక సౌకర్యాలు

– డిప్యూటీ సీఎం మల్లు భట్టి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ప్రజావాణిలో దూర ప్రాంతాలనుంచి వచ్చే ఫిర్యాదుదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేపట్టాల్సిన చర్యలను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శనివారం పరిశీలించారు. ప్రస్తుతం ఉన్న సౌకర్యాలు, శాశ్వత పద్ధతిన కొనుగోలు చేయాల్సిన వస్తు సామాగ్రి. రాబోయే వేసవిని దృష్టిలో పెట్టుకుని ఫిర్యాదుదారులకు ఇబ్బందులు లేకుండా చేస్తున్న ఏర్పాట్లు తదితర వివరాలను ప్రజావాణి నోడల్‌ ఆఫీసర్‌ దివ్య దేవరాజన్‌ భట్టికి వివరించారు.