నిండు జీవితానికి రెండు చుక్కలు: అజ్జు యాదవ్

నవతెలంగాణ – చిన్నకోడూరు
చిన్నారుల నిండు జీవితానికి పోలియో చుక్కలు వేయించాలని యూత్ కాంగ్రెస్ సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి అజ్జు యాదవ్ అన్నారు. చిన్నకోడూరు మండలం చెర్లంకిరెడ్డిపల్లి గ్రామ పంచాయతి కార్యాలయంలో వైద్య అధికారులు, ఆశ వర్కర్లు, అంగన్ వాడి టీచర్లు చిన్నారులకు వేస్తున్న పోలియో చుక్కల కేంద్రాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు అజ్జుయాదవ్ ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లలకు వచ్చే అనేక వ్యాధుల్లో పోలియో ఒకటనీ, ఇది వస్తే పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి తగ్గి కాళ్లు, చేతులూ వంకర అవుతాయని, కొన్ని కేసుల్లో మెదడుకి కూడా వ్యాపించి అవయవాలకు వైకల్యం సంభవిస్తుందని అన్నారు. ఇది అంటువ్యాధి కాదని, దీన్ని రాకుండా నివారించడానికి ఉన్న మార్గమే పోలియో చుక్కల మందు వేయడమని తెలిపారు. ఈ మందును పుట్టిన పిల్లల నుంచి 5 ఏళ్ల వయసు లోపు పిల్లలకు ఏటా ఒక రోజు ప్రభుత్వం ఉచితంగా వేస్తుందని తల్లిదండ్రులు తప్పనిసరిగా పిల్లలకు వేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు కొండం శ్రీనివాస్ రెడ్డి, మండల నాయకులు తుమ్మల శ్రీనివాస్, ఏఎన్ఏం కవిత, ఆశ వర్కర్లు మమత, మౌనిక, అంగన్ వాడి టీచర్ ఉమలత, గ్రామస్తులు లక్ష్మణ్, రాజు, నర్సయ్య, శ్రీనివాస్ పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు.