
భువనగిరి మండలంలోని బస్వాపురం గ్రామంలో ఎంపీపీ నారాల నిర్మల వెంకటస్వామి యాదవ్ పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జీరో నుంచి ఐదు సంవత్సరాల లోపు పిల్లలందరికీ పల్స్ పోలియో వేయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం, ఆశ వర్కర్లు, అంగన్వాడి, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.