నవతెలంగాణ – తొగుట
పోలియో రహిత సమాజమే లక్ష్యంగా ప్రతి ఒక్క రూ కృషి చేయాలని వైస్ ఎంపీపీ బాసిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని కాన్గల్ గ్రామంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని వైస్ ఎంపీపీ బాసిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదు సంవత్సరాల లోపు పిల్లలందరూ పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. వారందరికీ పల్స్ పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. పోలియో రహిత సమాజం నిర్మించడమే లక్ష్యమని అన్నా రు. కార్యక్రమంలో అంగన్వాడి టీచర్లు, ఆశ కార్య కర్తలు తదితరులు పాల్గొన్నారు.