పోలియో రహిత సమాజాన్ని నిర్మించుకుందాం: ఎంపీపీ మానస 

నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 
పోలియో రైతు సమాజాన్ని నిర్మించుకునేందుకు ఉపయోగపడుతుందని హుస్నాబాద్ ఎంపీపీ లకావత్ మానస అన్నారు. ఆదివారం హుస్నాబాద్ మండలంలోని మీర్జాపూర్ గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ తరాల లత, వైద్య బృందం, ఆశ వర్కర్లు, అంగన్వాడి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
హుస్నాబాద్ లో…హుస్నాబాద్ పట్టణంలో మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత పల్స్ పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ లు ఐలేని అనిత శ్రీనివాస్ రెడ్డి, బోజురమ దేవి, వాలా సుప్రజా నవీన్ రావు ,మాజీ ఎంపీపీ  ఆకుల వెంకన్న , ఐలేని శంకర్ రెడ్డి,యండి అయూబ్,బొజు రవీందర్ తదితరులు పాల్గొన్నారు.