సీపీఐ(ఎం) పార్టీ మండల కార్యదర్శిగా ఎన్నికైన: చింతల నాగరాజు

నవతెలంగాణ – ఉప్పునుంతల
అచ్చంపేట సీపీఐ(ఎం) పార్టీ కార్యాలయంలో సిపిఎం పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు యల్ .దేశ్య నాయక్ సమక్షంలో ఉప్పునుంతల మండల కార్యదర్శిగా కామ్రేడ్ నాగరాజును ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన మండల కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ.. మండలంలో బడుగు బలహీన వర్గాల చెందిన ప్రజలకు అందుబాటులో ఉండి, నిరంతరం వారు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల పోరాటం చేస్తానని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు శ్రీరాములు, లక్ష్మయ్య, రాములు, వెంకటయ్య తదితరులు ఉన్నారు.