
అంగవైకల్యానికి దూరంగా ఉండాలంటే పల్స్ పోలియో చుక్కలు తప్పకుండా వేయించుకోవాలని శంకరపట్నం మండల వైస్ ఎంపీపీ పులికోట రమేష్ అన్నారు.ఆదివారం శంకరపట్నం మండల పరిధిలోని గద్దపాక ,కాచాపూర్ గ్రామలలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించగా ముఖ్యఅతిథిగా వైస్ ఎంపీపీ పులి కోట రమేష్ హాజరై చంటి పిల్లకు పోలియో డ్రాప్స్ వేశారు.ఈ సందర్భంగా వైస్ ఎంపీపీ మాట్లాడుతూ, పల్స్ పోలియో చుక్కలు ప్రతి ఒక్కరు చంటి పిల్లలకు వినియోగించాలని అంగవైకల్యాన్ని రూపుమాపడానికి ఇది చక్కని అవకాశం అన్నారు.5 సంవత్సరంలోపు పిల్లలకు తప్పకుండా పోలియో చుక్కలు వేయించాలన్నారు.ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం లు, నర్స్ లు, ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.