ఆ షరతులు ఏంటి?

చైతన్య రావు, భూమి శెట్టి జంటగా నటించిన చిత్రం ‘షరతులు వర్తిస్తాయి’. కుమారస్వామి(అక్షర) దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని స్టార్‌ లైట్‌ స్టూడియోస్‌ బ్యానర్‌పై నాగార్జున సామల, శ్రీష్‌ కుమార్‌ గుండా, డాక్టర్‌ కష్ణకాంత్‌ చిత్తజల్లు నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 15వ తేదీన గ్రాండ్‌ థియేట్రికల్‌ రిలీజ్‌కు రెడీ అవుతోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ని రిలీజ్‌ చేశారు. ఈ సందర్భంగా నిర్మాత డాక్టర్‌ కష్ణకాంత్‌ చిత్తజల్లు మాట్లాడుతూ, ‘ఒక మంచి సినిమాతో మా సంస్థ లాంచ్‌ అవుతుండటం హ్యాపీగా ఉంది. మా ప్రొడక్షన్‌కు ఒక లాంగ్‌ రన్‌ ఉండాలని ప్లాన్‌ చేస్తున్నాం. అందులో ఫస్ట్‌ స్టెప్‌ ఈ సినిమా. ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. ఏషియన్‌ ఫిలిమ్స్‌, సురేష్‌ ప్రొడక్షన్స్‌ మా సినిమాను థియేటర్స్‌లో రిలీజ్‌ చేస్తున్నారు. ఇప్పటికి 60 థియేటర్స్‌ కన్ఫర్మ్‌ అయ్యాయి. మా టీమ్‌కు సపోర్ట్‌గా ఉన్న మామిడి హరికష్ణ, మధుర శ్రీధర్‌ రెడ్డికి థ్యాంక్స్‌’ అని అన్నారు. ‘మా సినిమా థియేట్రికల్‌ రిలీజ్‌ మంచి సంస్థల ద్వారా జరుగుతుండటం హ్యాపీగా ఉంది. సినిమా అనేది ఆర్ట్‌ బిజినెస్‌. ఇందులో మంచి పాయింట్‌తో పాటు కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఉంటాయి. మిమ్మల్ని ఎంగేజ్‌ చేసేలా సినిమా ఉంటుంది. ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన సినిమా. ఇందులో మీకు ఇబ్బందికరమైన సన్నివేశాలు ఒక్కటి కూడా ఉండవు’ అని దర్శకుడు కుమారస్వామి చెప్పారు. హీరో చైతన్య రావ్‌ మాట్లాడుతూ, ‘మా ట్రైలర్‌ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మీకు నచ్చితే మిగతా వారికి షేర్‌ చేయండి. మీరొక మంచి సినిమా సజెస్ట్‌ చేశారని వారు భావిస్తారు. అందరూ చూడాల్సిన సినిమా ఇది. మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి వాళ్ల జీవితాల్లో ఉండే సంతోషాలు, బాధలు, అన్ని ఎమోషన్స్‌ ఈ కథలో ఉంటాయి. మన మధ్య జరుగుతున్న కథలా ఉంటుంది. కుమారస్వామి మంచి డైరెక్టర్‌ మాత్రమే కాదు మంచి వ్యక్తి కూడా. ”షరతులు వర్తిసాయి” నా కెరీర్‌ లో గుర్తుండిపోయే సినిమా అవుతుంది. ఫ్యామిలీ ఆడియెన్స్‌కు నన్ను దగ్గర చేస్తుందని ఆశిస్తున్నాను’ అని తెలిపారు. ‘ఇదొక న్యూ ఏజ్‌ సినిమా. ఇదొక మంచి మూవీ. కరీంనగర్‌ నేపథ్యంలో చేశాం. నేను తెలంగాణ యాస నేర్చుకుని డైలాగ్స్‌ చెప్పాను. ఇలాంటి ట్రెండ్‌లో కూడా మంచి కాన్సెప్ట్‌తో సినిమా చేసిన మా నిర్మాతలకు కృతజ్ఞతలు’ అని హీరోయిన్‌ భూమి శెట్టి అన్నారు.